చీరకట్టులో ఫొటో పోస్టు చేసిన అల్లు అర్జున్ అర్ధాంగి స్నేహారెడ్డి... 'హాట్' అంటూ సమంత కామెంట్

23-12-2021 Thu 16:34
  • బ్లాక్ అండ్ బ్లాక్ లో స్నేహారెడ్డి
  • మేకోవర్ చేసిన స్టయిలిస్ట్ ప్రీతమ్ జుకాల్కర్
  • మనీశ్ మల్హోత్రా డిజైన్ చేసిన దుస్తులు
  • స్నేహారెడ్డి సౌందర్యానికి సమంత కాంప్లిమెంట్స్ 
Samantha comments on Allu Sneha Reddy latest pic
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అర్ధాంగి స్నేహారెడ్డి తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఒక ఫొటో పంచుకుంది. అందులో స్నేహారెడ్డి స్లీవ్ లెస్ బ్లాక్ బ్లౌజ్, బ్లాక్ శారీలో స్లిమ్ గా కనిపిస్తోంది. దీనిపై దక్షిణాది బ్యూటీ సమంత కూడా స్పందించింది. "హాట్" అంటూ ఒక్క పదంతో స్నేహారెడ్డి సౌందర్యాన్ని పొగిడింది. కాగా, స్నేహారెడ్డికి మేకోవర్ చేసింది ప్రముఖ స్టయిలిస్ట్ ప్రీతమ్ జుకాల్కర్ కాగా, ఆమె ధరించింది మనీశ్ మల్హోత్రా డిజైన్ చేసిన దుస్తులు. ప్రముఖ ఫొటోగ్రాఫర్ ఈషాన్ గిరి... స్నేహారెడ్డిని క్లిక్ మనిపించాడు.