Anitha: నాని మాదిరి టాలీవుడ్ కు చెందిన పెద్ద హీరోలు కూడా మాట్లాడాలి: టీడీపీ నాయకురాలు అనిత

YSRCP ministers now targets actor Nani family ladies says Anitha
  • సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయం గురించి నాని మాట్లాడారు
  • నాని ఇంట్లోని మహిళలను వైసీపీ మంత్రులు టార్గెట్ చేస్తారేమో   
  • అశోక్ గజపతిరాజునే తిట్టిన మంత్రులకు నాని ఒక లెక్క కాదన్న అనిత 

ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై సినీ హీరో నాని మాట్లాడటం మంచి పరిణామమని, అభినందించదగ్గ విషయమని టీడీపీ నాయకురాలు అనిత అన్నారు. సినిమా టికెట్ల ధరలను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదని నాని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో అనిత మాట్లాడుతూ... నాని మాదిరి టాలీవుడ్ కు చెందిన పెద్ద హీరోలు మాట్లాడాలని అన్నారు. పెద్ద హీరోలు విజయవాడకు వచ్చి సీఎం జగన్ ను, మంత్రి పేర్ని నానిని కలిసి వెళ్లడం కాదని... పరిశ్రమకు జరుగుతున్న అన్యాయంపై ధైర్యంగా మాట్లాడాలని సూచించారు.
 
ప్రతి రంగాన్ని జగన్ ఇబ్బందులపాలు చేస్తున్నారని అనిత మండిపడ్డారు. తన సొంత రంగమైన సినీపరిశ్రమకు ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై హీరో నాని మాట్లాడారని ప్రశంసించారు. ప్రభుత్వ తప్పును నాని ఎత్తి చూపారు కాబట్టి... ఇప్పుడు ఆయన ఇంట్లోని మహిళలను వైసీపీ మంత్రులు టార్గెట్ చేస్తారేమోనని అన్నారు. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజునే తిట్టిన ఏపీ మంత్రులకు నాని కుటుంబ సభ్యులను తిట్టడం పెద్ద విషయం కాదని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News