R Srinivasulu Reddy: కడప జిల్లాలో జగన్ ఒక్క పని కూడా పూర్తి చేయలేదు: టీడీపీ నేత ఆర్.శ్రీనివాసులురెడ్డి

Jagan has done no work in Kadapa district says Srinivasulu Reddy
  • వేల కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపనలు చేశారు
  • ఇంత వరకు ఒక్క పని కూడా పూర్తి చేసింది లేదు
  • పనుల పురోగతిపై ఒక్కసారైనా సమీక్ష నిర్వహించారా?
సొంత జిల్లా కడపకు ముఖ్యమంత్రి జగన్ చేసిందేమీ లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్.శ్రీనివాసులు రెడ్డి విమర్శించారు. ఇప్పటికి మూడు సార్లు కడపలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడానికి వచ్చి వేల కోట్ల రూపాయల విలువైన పనులకు శంకుస్థాపనలు చేశారని... కానీ ఇంత వరకు పూర్తి చేసిందేమీ లేదని అన్నారు.

పునాదిరాళ్లు వేసిన పనుల పురోగతిపై జగన్ ఒక్కసారైనా సమీక్ష నిర్వహించారా? అని ప్రశ్నించారు. గతంలో రెండు సార్లు వేసిన పునాదిరాళ్లను జగన్ ఒకసారి చూడాలని ఎద్దేవా చేశారు. జగన్ కేవలం శంకుస్థాపనలకే పరిమితమవుతున్నారని అన్నారు. అన్నమయ్య కట్ట తెగిపోయి ఎంతో మంది చనిపోతే... ఇంతవరకు ఆ కట్ట పునరుద్ధరణ పనులు కూడా చేపట్టలేదని విమర్శించారు.
R Srinivasulu Reddy
Telugudesam
Jagan
YSRCP
Kadapa District

More Telugu News