Telangana: ఒమిక్రాన్ నేపథ్యంలో.. ఆంక్షలు విధించాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

High Court order TS govt to impose restrictions during Christmas and New Year
  • రాష్ట్రంలో కరోనా పరిస్థితి గురించి విచారణ జరిపిన హైకోర్టు
  • క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి సందర్భంగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశం
  • రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశాలు
తెలంగాణ హైకోర్టులో రాష్ట్రంలోని కరోనా పరిస్థితి గురించి ఈరోజు విచారణ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. క్రిస్మస్, నూతన సంవత్సర, సంక్రాంతి వేడుకల సందర్భంగా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రజలు గుమికూడకుండా ఉండేలా చూడాలని చెప్పింది.

రాష్ట్రంలోకి ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే ప్రవేశించిందని... వేగంగా వ్యాప్తి చెందే ఈ వేరియంట్ పై అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. కొత్త వేరియంట్ వ్యాప్తిని అరికట్టేందుకు పండుగలు, సెలెబ్రేషన్స్ పై ఆంక్షలు విధించాలని హైకోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించి రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయాలని స్పష్టం చేసింది. 
Telangana
High Court
Omicron
New Year

More Telugu News