Dhanush: ధనుశ్ తెలుగు మూవీ టైటిల్ ఖరారు!

Dhanush in Venky Atluri Movie
  • వరుస సినిమాలతో ధనుశ్ బిజీ
  • తెలుగు కథలపై ఆసక్తి
  • వెంకీ అట్లూరితో సెట్స్ పైకి
  • లైన్లో శేఖర్ కమ్ముల
కోలీవుడ్ లో కొత్తదనానికి ప్రాధాన్యతనిచ్చే కథానాయకులలో ధనుశ్ ఒకరుగా కనిపిస్తాడు. కథాకథనాలపై ధనుశ్ కి మంచి పట్టు ఉంది. అలాగే తన సినిమాల కోసం సరదాగా గాయకుడిగా కూడా మారిపోతుంటాడు. కొన్ని కథలు కమర్షియల్ గా వర్కౌట్ కావని తెలిసినా తనకి నచ్చితే తన సొంత బ్యానర్ పై నిర్మిస్తాడు.

ప్రస్తుతం తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన, తెలుగులో రెండు సినిమాలు చేయడానికి రెడీ అయ్యాడు. ఒక సినిమాకి శేఖర్ కమ్ముల దర్శకుడు అయితే, మరో సినిమాకి వెంకీ అట్లూరి దర్శకుడు. తాజాగా వెంకీ అట్లూరి దర్శకత్వం వహించే సినిమాకి టైటిల్ ను ఖరారు చేశారు. తెలుగులో 'సార్' అనీ .. తమిళంలో 'వాతి' అని ఈ సినిమాకి నామకరణం చేశారు.

తాజాగా టైటిల్ పోస్టర్స్ ను రిలీజ్ చేశారు. నాగవంశీ - సాయిసౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమాకి, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. 'మిస్టర్ మజ్ను' .. 'రంగ్ దే' వంటి రెండు ఫ్లాపులున్న వెంకీ అట్లూరికి ధనుశ్ ఛాన్స్ ఇవ్వడం విశేషమే..
Dhanush
Samyuktha Menen
Venky Atlury
Sir Movie

More Telugu News