omicron: ఒమిక్రాన్ తో ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితులు తక్కువే.. తాజా అధ్యయనాలలో వెల్లడి!

Omicron less likely to put you in the hospital studies say
  • డెల్టా రకంతో పోలిస్తే 20 శాతం తక్కువ ప్రభావం
  • ఇంపీరియల్ కాలేజీ ఆఫ్ లండన్ అధ్యయనం
  • ఒకటో వంతు మందికే ఆసుపత్రి చికిత్స అవసరం
  • యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్ బర్గ్ పరిశోధనలో గుర్తింపు

ఒమిక్రాన్ శరవేగంగా ప్రపంచ దేశాలను చుట్టేస్తోంది. మన దేశంలోనూ కరోనా ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు 236కు, తెలంగాణలో వీటి సంఖ్య 38కు చేరుకుంది. అమెరికా, బ్రిటన్, దక్షిణాఫ్రికాలో వీటి కేసుల సంఖ్య అధికంగా ఉంది.

అయితే, ఒమిక్రాన్ కేసుల వ్యాప్తి ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఈ వైరస్ కారణంగా అనారోగ్య తీవ్రత తక్కువగానే ఉంటున్నట్టు అమెరికా వైద్యులు తాజాగా పేర్కొన్నారు. అంతేకాదు డెల్టా వేరియంట్ తో పోలిస్తే కరోనా ఒమిక్రాన్ రకంలో ప్రభావం తక్కువగా ఉంటున్నట్టు రెండు బ్రిటిష్ తాజా అధ్యయనాలు కూడా తేల్చడం ఊరటనిచ్చేదే.

ఒమిక్రాన్ కారణంగా వ్యాధి తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ వేగంగా వ్యాప్తి చెందడంతోపాటు.. టీకాలకు దొరక్కుండా తప్పించుకోగలదని గుర్తించారు. భారీగా వచ్చి పడే కేసులతో ఆసుపత్రులలో రద్దీకి దారితీయవచ్చని అంచనా వేస్తున్నారు. బుధవారం విడుదలైన రెండు బ్రిటిష్ అధ్యయనాల ప్రకారం.. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ అంత హానికరం కాదని వండర్ బిల్ట్ యూనివర్సిటీ బయోకెమిస్ట్ మాన్యుయేల్ ఆస్కానో తెలిపారు. అప్రమత్తంగా వ్యవహరించడమే ఈ వైరస్ విషయంలో మెరుగైన విధానంగా అభిప్రాయపడ్డారు.

ఇంగ్ల్ండ్ లో ఒమిక్రాన్ కారణంగా ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితులు డెల్టా రకంతో పోలిస్తే 20 శాతం తక్కువగా ఉంటాయని ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ అధ్యయనం తేల్చింది. ఒక రోజు కంటే ఎక్కువగా ఆసుపత్రిలో ఉండాల్సిన పరిస్థితి 40 శాతం తక్కువగా ఉంటుందని అంచనాకు వచ్చింది. యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్ బర్గ్ శాస్త్రవేత్తలు చేసిన మరో పరిశోధన ప్రకారం.. ఒమిక్రాన్ రకంలో ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం డెల్టాతో పోలిస్తే మూడింట రెండొంతులు తక్కువగా ఉంటుందని తేలింది. 

  • Loading...

More Telugu News