Ashok Gajapathi Raju: అశోక్ గజపతిరాజుపై కేసు నమోదు!

Police case filed against Ashok Gajapathi Raju
  • నిన్న రామతీర్థంలో శంకుస్థాపన సందర్భంగా ఘర్షణ
  • తనకు సమాచారం ఇవ్వలేదంటూ అశోక్ గజపతి ఆగ్రహం  
  • కార్యక్రమానికి ఆటంకం కలిగించారంటూ ఆలయ ఈవో ఫిర్యాదు
టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై పోలీస్ కేసు నమోదైంది. నిన్న రామతీర్థంలో శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా ఘర్షణ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. శంకుస్థాపన కార్యక్రమానికి మంత్రులు వెల్లంపల్లి, బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. అయితే, తనకు సమాచారం ఇవ్వకుండా కార్యక్రమం నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన అశోక్ శిలాఫలకాన్ని తోసేశారు. ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.

ఈ నేపథ్యంలో ఆయనపై నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ లో ఆలయ ఈవో ప్రసాద్ ఫిర్యాదు చేశారు. శంకుస్థాపన కార్యక్రమానికి, తమ విధులకు ఆటంకం కలిగించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు 473,353 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
Ashok Gajapathi Raju
Telugudesam
Case

More Telugu News