Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా కారు అందుకున్న తెలంగాణ జిమ్నాస్ట్ అరుణారెడ్డి

Chiranjeevi handed KIA Car to Gymnast Budda Aruna Reddy
  • అంతర్జాతీయ పోటీల్లో అరుణారెడ్డి ప్రతిభ
  • రెండేళ్ల కిందట మోకాలికి శస్త్రచికిత్స
  • ఇటీవలే బరిలో దిగిన అరుణారెడ్డి
  • ఈజిప్టు పోటీల్లో రెండు స్వర్ణాలు కైవసం
  • కారును కానుకగా ఇస్తానని ప్రకటించిన చాముండేశ్వరనాథ్
అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభాపాటవాలు ప్రదర్శిస్తున్న తెలంగాణ జిమ్నాస్ట్ బుద్ధా అరుణారెడ్డికి కారు అందిస్తానని బీసీసీఐ జూనియర్ సెలెక్షన్ కమిటీ మాజీ చైర్మన్ చాముండేశ్వరనాథ్ గతంలో ప్రకటించారు. ఆయన తన మాట ఇప్పుడు నిలుపుకున్నారు. తాజాగా హైదరాబాద్, జూబ్లీహిల్స్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా అరుణారెడ్డికి కియా సోనెట్ కారును బహూకరించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ పోర్టు చైర్మన్ కేవీ రావు కూడా పాల్గొన్నారు.

25 ఏళ్ల బుద్ధా అరుణారెడ్డి 2018లో వరల్డ్ జిమ్నాస్టిక్స్ చాంపియన్ షిప్ లో కాంస్యం సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. అనూహ్యరీతిలో మోకాలి గాయం కారణంగా విరామం తీసుకుంది. రెండేళ్ల కిందట మోకాలి శస్త్రచికిత్స చేయించుకున్న అరుణారెడ్డి ఇటీవలే మళ్లీ జిమ్నాస్టిక్స్ బరిలో దిగింది. ఈజిప్టులో జరిగిన పోటీల్లో రెండు స్వర్ణాలు సాధించి సత్తా చాటింది.

అరుణ ఘనతల గురించి, మోకాలి శస్త్రచికిత్స తెలుసుకున్న చిరంజీవి ఆమెను అభినందించారు. మరిన్ని విజయాలు సాధించాలంటూ ఆశీర్వదించారు.
Chiranjeevi
Budda Aruna Reddy
KIA Car
Gymnast
Chamundeswaranath
Telangana

More Telugu News