Gopichand: మరోసారి సెట్స్ పైకి వెళుతున్న హిట్ కాంబినేషన్!

Giopichand in Sriwass Movie
షార్ట్స్‌లో చూడండి
గోపీచంద్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి గ్యాప్ రాకుండా చూసుకుంటున్నాడు. వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్న ఆయనకి కొంతకాలంగా సరైన హిట్ పడలేదు. దాంతో ఆయన హిట్టు కోసం వెయిట్ చేస్తూనే వస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తన 30వ సినిమాను సెట్స్ పైకి తీసుకుని వెళుతున్నాడు. ఈ సినిమాకి శ్రీవాస్ దర్శకత్వం వహించనున్నాడు.

గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'లక్ష్యం' .. 'లౌక్యం' సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న మూడో సినిమా ఇది. ఈ నెల 24వ తేదీన ఈ సినిమా షూటింగు హైదరాబాదులో ప్రారంభం కానుంది. విశ్వప్రసాద్ - వివేక్ కూచిభొట్ల ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.

భారీ బడ్జెట్ తో నిర్మితం కానున్న ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. కథానాయిక ఎవరు? ప్రతినాయకుడు ఎవరు? అనే విషయాలతో పాటు, ఇతర వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. గోపీచంద్ తాజా చిత్రంగా 'పక్కా కమర్షియల్' ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Gopichand
Sriwass
Tollywood

More Telugu News