Rahul Gandhi: మూడో డోసు ఎప్పుడిస్తారు?: రాహుల్ గాంధీ

  • ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నా కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది
  • ఇప్పటికీ దేశంలో ఎక్కువ మందికి వ్యాక్సిన్ ఇవ్వలేదు
  • థర్డ్ వేవ్ ను నివారించాలంటే కనీసం 60 శాతం జనాభాకు వ్యాక్సినేషన్ ఇవ్వాలి
When did you give third dose asks Rahul Gandhi

దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ప్రజలకు వ్యాక్సిన్ బూస్టర్ డోసులు ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. దేశంలో ఇప్పటికీ ఎక్కువ మందికి వ్యాక్సిన్ ఇవ్వలేదని... ఇక బూస్టర్ డోసులు ఇంకెప్పుడిస్తారని ఎద్దేవా చేశారు.

ఒకవేళ ఇదే వేగంతో వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగితే, డిసెంబర్ చివరి నాటికి కేవలం 42 శాతం జనాభాకు మాత్రమే వ్యాక్సినేషన్ పూర్తవుతుందని చెప్పారు. థర్డ్ వేవ్ ను నివారించాలంటే ఈ నెల చివరి నాటికి కనీసం 60 శాతం జనాభాకు రెండు డోసుల వ్యాక్సినేషన్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. ఒమిక్రాన్ భయాలు ఉన్నా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రాహుల్ విమర్శించారు. 

More Telugu News