Andhra Pradesh: కృష్ణా జిల్లాలో 15 సినిమా థియేటర్ల సీజ్

15 Theatres are Seized in Krishna District by AP Govt
  • సినిమా థియేటర్లలో కొనసాగుతున్న తనిఖీలు
  • తినుబండారాల రేట్లు ఎక్కువగా ఉన్నట్టు గుర్తింపు
  • అన్ని థియేటర్లలో ఫిక్సుడు రేట్లను నిర్ణయించే దిశగా ప్రభుత్వం

ఏపీలో సినిమా థియేటర్లపై పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. కృష్ణా జిల్లాలో 15 సినిమా థియేటర్లను సీజ్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. టికెట్ రేట్లు, ఫైర్ సేఫ్టీ, కోవిడ్ ప్రొటోకాల్ పాటిస్తున్నారా అనేవి సోదాలు చేస్తున్నారు. తనిఖీల సందర్భంగా తినుబండారాల రేట్లు ఎక్కువగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఇకపై మల్టీప్లెక్స్ లతో పాటు అన్ని థియేటర్లలో ఫిక్సుడు రేట్లను నిర్ణయించనున్నారు. టికెట్ల ధరలకు సంబంధించి ప్రభుత్వం జీవో 35ను కోర్టు కొట్టేయడంతో అంతకు ముందు ఉన్న రేట్లపై అధికారులు దృష్టి సారించారు.

  • Loading...

More Telugu News