ఓలా రైడర్లకు ఊరట.. ట్రిప్ వివరాలు డ్రైవర్లకు ముందుగానే తెలిసే ఏర్పాటు చేసిన సంస్థ
- ట్రిప్ వివరాలు నచ్చితేనే అంగీకరించొచ్చు
- ఏ విధానంలో చార్జీ చెల్లించాలన్నదీ ముందుగానే తెలుస్తుంది
- మార్పులు చేసినట్టు ప్రకటించిన ఓలా
ఇలా ట్రిప్పులను రద్దు చేయడం వల్ల విలువైన సమయం వృథా అయిపోయి రైలు, విమాన సర్వీసులను అందుకోలేకపోయిన వారు ఎందరో ఉన్నారు. ఒకవైపు క్యాబ్ బుక్ చేసుకున్న వారికి ఈ తీరుతో అసహనం ఏర్పడుతుంటే.. క్యాబ్ డ్రైవర్లు కూడా ట్రిప్పులను కోల్పోతున్నారు. ఇది సంస్థ మనుగడకే ఇబ్బందికరమని గుర్తించిన ఓలా ఓ పరిష్కారంతో ముందుకు వచ్చింది.
సాధారణంగా క్యాబ్ డ్రైవర్లకు కస్టమర్ పాయింట్ కు వచ్చి, పికప్ చేసుకున్నట్టు ఓకే చేస్తే గానీ వారిని ఎక్కడకు తీసుకెళ్లాలన్నది తెలిసేది కాదు. ఇకమీదట డ్రైవర్లకు ట్రిప్ వివరాలు ముందుగానే తెలిసేలా సాఫ్ట్ వేర్ లో మార్పులు చేసినట్టు ఓలా ప్రకటించింది. దాంతో అసలు ఆ ట్రిప్ ను అంగీకరించాలా? లేదంటే తిరస్కరించాలా? అన్నది వారి ఇష్టంపైనే ఆధారపడి ఉంటుంది. ట్రిప్ చార్జీని ఏ విధానంలో చెల్లింపులు జరిపేదీ ముందుగానే తెలిసేలా ఓలా ఏర్పాట్లు చేసింది. దీంతో వారికి ఇష్టమైతేనే ట్రిప్పును అంగీకరించవచ్చు.