RRR: భారీ స్థాయిలో 'ఆర్ఆర్ఆర్' ప్రీరిలీజ్ ఈవెంట్.. గెస్టులుగా రాబోతున్నది వీరిద్దరేనా..?

Chiranjeevi and Balakrishna to be chief guests for RRR pre release event
  • ముమ్మరంగా 'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు
  • ఇటీవలే బాలీవుడ్ లో భారీ ఎత్తున ప్రీరిలీజ్ ఈవెంట్
  • టాలీవుడ్ లో ప్రీరిలీజ్ ఈవెంట్ కు రెడీ అవుతున్న మేకర్స్
  • ముఖ్య అతిథులుగా చిరంజీవి, బాలయ్య అంటూ వార్తలు
  • జనవరి 7న విడుదల అవుతున్న 'ఆర్ఆర్ఆర్'

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ 'ఆర్ఆర్ఆర్' విడుదలకు సిద్ధమవుతోంది. టాలీవుడ్ రికార్డులను ఈ సినిమా బద్దలు చేస్తుందనే అంచనాలు సర్వత్ర నెలకొన్నాయి. హిందీలో సైతం ఈ సినిమా ఒక ఊపు ఊపుతుందని భావిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యాక్రమాలు ఊపందుకున్నాయి. ఇటీవలే బాలీవుడ్ కు సంబంధించి ముంబైలో ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ కు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, నిర్మాత కరణ్ జొహార్ తదితరులు హాజరయ్యారు.

ఇక ఇప్పుడు టాలీవుడ్ లో ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఓ రేంజ్ లో నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కు చిరంజీవి, బాలకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ సినిమాలో అలియా భట్, అజయ్ దేవగణ్, శ్రియ, సముద్రఖని తదితరులు ప్రధాన పాత్రలను పోషించారు. జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కాబోతోంది.

  • Loading...

More Telugu News