'యశోద' కోసం రంగంలోకి దిగిన మలయాళ స్టార్!

22-12-2021 Wed 11:27
  • తెలుగు తెరకి ఉన్నిముకుందన్
  • 'జనతా గ్యారేజ్'తో పరిచయం
  • 'భాగమతి'తో మంచి గుర్తింపు
  • 'యశోద'లో కీలకమైన పాత్ర    
Yashoda Movie Update
మొదటి నుంచి కూడా టాలీవుడ్ తెరపై కోలీవుడ్ ఆర్టిస్టుల ప్రభావం ఎక్కువ. అలాగే అక్కడి సినిమాలు కూడా ఇక్కడ ఎక్కువగా అనువాదమవుతూ ఉంటాయి. అయితే ఇటీవల కాలంలో ఇక్కడ మలయాళ రీమేకులకు ఆదరణ పెరుగుతూ పోతోంది. కంటెంట్ ప్రధానమైన అక్కడి కథలను ఇక్కడి ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

గతంలో మలయాళం నుంచి మమ్ముట్టి .. మోహన్ లాల్ .. సురేశ్ గోపి వంటి కొంతమంది హీరోలు మాత్రమే ఇక్కడి ప్రేక్షకులకు చేరువ కాగలిగారు. ఈ మధ్యలో అక్కడి నుంచి వచ్చిన హీరోగా ఉన్ని ముకుందన్ నెమ్మదిగా అవకాశాలను పెంచుకుంటున్నాడు.
'జనతా గ్యారేజ్' .. 'భాగమతి' సినిమాలతో మెప్పించిన ఆయన, 'ఖిలాడి' సినిమాలోను ప్రేక్షకులను పలకరించనున్నాడు.

తాజాగా ఆయనను 'యశోద' సినిమా కోసం తీసుకున్నారు. సమంత ప్రధానమైన పాత్రను పోషించే సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది. ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతున్న ఈ సినిమా షూటింగులో ఉన్ని ముకుందన్ జాయిన్ అయ్యాడు.