ఓ నెటిజన్ చేసిన తీవ్ర వ్యాఖ్యలపై సమంత స్పందన ఇదిగో!

21-12-2021 Tue 18:30
  • విడిపోయిన సమంత, నాగచైతన్య
  • చాలాకాలంగా విభేదాలపై ప్రచారం
  • ఇటీవల సంయుక్త ప్రకటన చేసిన సామ్, చైతూ
  • సెకండ్ హ్యాండ్ ఐటమ్ అంటూ నెటిజన్ తీవ్ర వ్యాఖ్యలు
Samantha reacts to criticism in social media
టాలీవుడ్ లో క్యూట్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న నాగచైతన్య, సమంత కొంతకాలం కిందట విడిపోతున్నట్టు ప్రకటించడం తెలిసిందే. వారి కాపురంలో కలతలపై తీవ్రస్థాయిలో ఊహాగానాలు వచ్చాయి. విడాకుల ప్రకటనతో ఆ ఊహాగానాలకు అడ్డుకట్ట పడినప్పటికీ, సమంతపై ట్రోలింగ్ మరింత ఎక్కువైంది.

తాజాగా ఓ నెటిజన్ దారుణమైన రీతిలో స్పందించాడు. సమంత విడాకులు తీసుకుని నాశనమైన ఓ సెకండ్ హ్యాండ్ ఐటమ్ అంటూ వ్యాఖ్యానించాడు. అంతేకాదు, ఓ జెంటిల్మన్ నుంచి అప్పనంగా రూ.50 కోట్లు దోచుకుందని తీవ్ర ఆరోపణ చేశాడు. ఈ మేరకు అతడు ట్వీట్ చేశాడు. దీనిపై సమంత స్పందించింది. "నీ ఆత్మను దేవుడు దీవించుగాక" అంటూ వ్యాఖ్యానించింది.

ఈ సందర్భంగా నెటిజన్లలో అత్యధికులు సమంతకు మద్దతుగా నిలిచారు. ఇలాంటి కామెంట్లకు స్పందించడం అనవసరం అని, తామంతా సమంతకు బాసటగా ఉంటామని పేర్కొన్నారు. సమంత ఇలాంటి దుష్ప్రచారాన్ని పట్టించుకోకుండా సినిమాలపై దృష్టి సారించాలని పలువురు సూచించారు.