రజనీకాంత్ ముందుకు ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్!

21-12-2021 Tue 18:00
  • రజనీ ముందుకు కొత్త కథలు
  • లైన్లో ఉన్న దర్శకులు
  • ఆయన నిర్ణయం కోసం వెయిటింగ్
  • బాల్కి కథపై రజనీ ఆసక్తి  
Rajani in Balki Movie
రజనీకాంత్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. గతంలో సీనియర్ దర్శకులకు మాత్రమే అవకాశం ఇచ్చిన ఆయన, ఈ మధ్య కాలంలో యువ దర్శకులకు కూడా అవకాశం ఇస్తున్నారు. దాంతో ఆయనతో సినిమా చేయడానికి దర్శకులంతా పోటీపడుతున్నారు. కొత్త కథలను వినడంలో రజనీ మరింత బిజీ అయ్యారు.

రీసెంట్ గా 'అన్నాత్తే' చేసిన శివకి మరో కథ రెడీ చేసుకోమని రజనీ చెప్పారు. అలాగే ఆల్రెడీ ఆయనతో చేసిన పా రంజిత్ .. కార్తీక్ సుబ్బరాజ్ కొత్త కథలను రజనీకి వినిపించి ఆయన నిర్ణయం కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకి ఒక కథ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించిందట. ఆ కథను రాసుకొచ్చిన ఆ దర్శకుడు 'బాల్కి' అని పిలవబడే బాలకృష్ణన్.

విభిన్నమైన కథా చిత్రాల దర్శకుడిగా ఆయనకి మంచి క్రేజ్ ఉంది. పా .. ఇంగ్లిష్ వింగ్లీష్ .. కీ అండ్ కా .. ప్యాడ్ మేన్ వంటి హిందీ సినిమాలకు ఆయన దర్శకత్వం వహించాడు. రజనీ కోసం ఆయన రెడీ చేసిన కథ కొత్తగా ఉందట. తన ఇమేజ్ కి భిన్నంగా ఉన్న ఈ సినిమా చేయడం ఒక ప్రయోగం వంటిదే అయినా, కొత్తదనం కోసం చేయాలనే నిర్ణయానికి రజనీ వచ్చాడని అంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.