Nani: నాకు డాన్స్ వచ్చుగదా అని ఆ పాట పెట్టలేదు: సాయిపల్లవి

  • దేవదాసీగా కనిపిస్తాను
  • సందర్భానికి తగిన పాట అది  
  • నా డాన్స్ ను మెచ్చుకుంటున్నారు
  • రిలీజ్ డేట్ కోసం వెయిటింగన్న సాయిపల్లవి
Shyam Singha Roy movie update

నాని హీరోగా దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ 'శ్యామ్ సింగ రాయ్' సినిమాను రూపొందించాడు. కలకత్తా నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు కనిపించనున్నారు. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాను ఈ నెల 24వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి.

తాజా ఇంటర్వ్యూలో సాయిపల్లవి మాట్లాడుతూ, ''ఈ సినిమాలో నేను చేసిన డాన్స్ కి మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాకి  ఈ పాట హైలైట్ గా నిలుస్తుందని అనుకుంటున్నాము. నాకు డాన్స్ వచ్చుగదా అని ఈ పాటను పెట్టలేదు. సందర్భానికి తగినట్టుగానే ఈ పాటను పెట్టడం జరిగింది.

ఈ సినిమాలో నేను దేవదాసీ పాత్రలో కనిపిస్తాను. ఆ పాత్రని అర్థం చేసుకుని చేయడానికి నాకు కొంత సమయం పట్టింది. నా పాత్ర .. ఈ సినిమా రెండూ కూడా నాకు మంచి పేరు తీసుకువస్తాయని భావిస్తున్నాను. మీ అందరితో పాటే నేను కూడా ఈ సినిమాను థియేటర్లో చూడటానికి ఉత్సాహంగా ఉన్నాను" అంటూ చెప్పుకొచ్చింది.

More Telugu News