Y Sujana Chowdhary: ఏపీలో అరాచకత్వానికి ఈ రెండు ఘటనలు నిదర్శనం: సుజనా చౌదరి

Sujana Chowdary opines on two incidents in recent days
  • వైజాగ్ లో జగదీశ్వరుడు అనే వ్యక్తి సెల్ఫీ వీడియో కలకలం
  • ఒంగోలు వైసీపీ కార్యకర్త సుబ్బారావు గుప్తాపై దౌర్జన్యం
  • ఈ రెండు ఘటనలను ప్రస్తావించిన సుజనా
  • పోలీసులకు ఫిర్యాదు చేయాలని బాధితులకు సూచన
ఒంగోలు వైసీపీ కార్యకర్త సుబ్బారావు గుప్తాపై దాడి, వైజాగ్ కు చెందిన జగదీశ్వరుడు అనే వ్యాపారవేత్త సెల్ఫీ వీడియో ఘటనలు రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతున్నాయి. దీనిపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి స్పందించారు.

వైజాగ్ లో జగదీశ్వరుడు, ఒంగోలులో సుబ్బారావు గుప్తా ఘటనలు రాష్ట్రంలో అరాచకం ఏ స్థాయికి చేరిందో చెబుతున్నాయని వివరించారు. ఏపీలో రౌడీయిజం తీరుతెన్నులకు ఆ ఘటనలు దృష్టాంతాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. దుర్మార్గులు తరచుగా ప్రభుత్వంలోని పెద్దల పేర్లు చెబుతూ బెదిరింపులకు, బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నారని సుజనా ఆరోపించారు.

ఈ దారుణాలకు అడ్టుకట్ట వేసేందుకు సీఎం రంగంలోకి దిగాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు ఎదుర్కొనే బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని, ఆ ఫిర్యాదు కాపీలను తన ఈ-మెయిల్ ([email protected]) కు పంపాలని సుజనా సూచించారు. తాను మద్దతుగా నిలుస్తానని హామీ ఇచ్చారు.
Y Sujana Chowdhary
Jagadeeswarudu
Subbarao Gupta
Vizag
Ongole

More Telugu News