Telangana: తెలంగాణలో మరో ఒమిక్రాన్ కేసు నిర్ధారణ!

  • తెలంగాణలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు
  • రాజన్న సరిసిల్ల జిల్లాలో కేసు నిర్ధారణ
  • దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్
Omicron case in Rajanna Sircilla district

ఇండియాలో క్రమంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో సైతం కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా తెలంగాణలో మరో కేసు నిర్ధారణ అయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెంకు చెందిన వ్యక్తి దుబాయ్ నుంచి వచ్చాడు. ఇంటికి చేరుకున్న అతనికి ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆయనను వైద్య చికిత్స నిమిత్తం హైదరాబాదుకు తరలించారు. అంతేకాదు ఆయన కుటుంబ సభ్యులను, ఆయనతో కాంటాక్ట్ లోకి వచ్చిన మరో ఏడుగురిని క్వారంటైన్ చేశారు. గూడెంలో వీధుల్లో శానిటైజేషన్ చేశారు.

ఈ నెల 16న సదరు వ్యక్తి దుబాయ్ నుంచి గూడెంకు వచ్చాడు. దుబాయ్ ఎయిర్ పోర్టులోను, హైదరాబాద్ ఎయిర్ పోర్టులోనూ ఆయనకు పరీక్షలు నిర్వహించారు. అయితే రెండు చోట్లా నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. కానీ జీనోమ్ సీక్వెన్స్ పరీక్షల కోసం పంపిన నమూనాల్లో ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ అయింది. దీంతో ఆయన కుటుంబసభ్యులతో కలిపి మొత్తం 13 మందిని వైద్యాధికారులు క్వారంటైన్ చేశారు.

More Telugu News