Galla Jayadev: కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కు గ‌ల్లా జ‌య‌దేవ్ లేఖ

galla writes letter to tomar
  • అకాల వర్షాలతో ఇప్పటికే నష్టపోయిన రైతులు
  • ఇప్పడు కొత్త రకం తెగుళ్ల ముప్పు
  • కేంద్రం శాస్త్రవేత్తలను గుంటూరు పంపాలి
  • రైతులకి కావలసిన సాంకేతిక సహాయం అందించాలి
కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కు టీడీపీ ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ లేఖ రాశారు. కొత్త రకం తెగుళ్ల ముప్పుతో రైతులు కుంగిపోతున్నార‌ని ఆయ‌న చెప్పారు. ఇప్ప‌టికే అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఇప్పుడు మ‌రో క‌ష్టం వ‌చ్చింద‌ని, వారిని ఆదుకోవాల‌ని ఆయన కోరారు.

'అకాల వర్షాలతో ఇప్పటికే నష్టపోయిన రైతులు, ఇప్పుడు కొత్త రకం తెగుళ్ల ముప్పుతో మరింత కుంగిపోతున్నారు. అప్పులు చేసి మరీ మిర్చి పంట సాగు చేస్తున్న రైతులను ఈ రసం పీల్చే పురుగు మరింత నిరాశలోకి నెట్టివేస్తోంది. పంట చేతికొచ్చే సమయానికి మిర్చి రైతుల ఆవేదన అంతా ఇంతా కాదు' అని గ‌ల్లా జ‌య‌దేవ్ తెలిపారు.

'కేంద్రం శాస్త్రవేత్తలను, వ్యవసాయ శాఖ అధికారులను గుంటూరులోని ప్రభావిత ప్రాంతాలకు పంపించి రైతులకి కావలసిన సాంకేతిక సహాయం అందించాలని, పంట నష్టం అంచనా వేసి తక్షణమే పరిహారం ఇచ్చి ఆర్థికంగా ఆదుకోవాలని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గారిని కోరాము' అని గ‌ల్లా జ‌య‌దేవ్ ట్వీట్ చేశారు.
Galla Jayadev
Telugudesam
Guntur District

More Telugu News