రిలీజ్ డేట్ విషయంలో ఆలోచనలో పడిన 'గని'

21-12-2021 Tue 11:47
  • వరుణ్ తేజ్ హీరోగా 'గని'
  • బాక్సింగ్ నేపథ్యంలో నడిచే కథ
  • కీలకమైన పాత్రలో జగపతిబాబు
  • మార్చిలో ప్రేక్షకుల ముందుకొచ్చే ఛాన్స్  
Ghani movie update
వరుణ్ తేజ్ హీరోగా 'గని' సినిమా రూపొందింది. సిద్ధు ముద్ద - అల్లు బాబీ నిర్మిస్తున్న ఈ సినిమాకి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించాడు. బాక్సింగ్ నేపథ్యంలో నిర్మితమైన కథ ఇది. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. ఈ సినిమాతో కథానాయికగా సయీ మంజ్రేకర్ పరిచయమవుతోంది.

ఈ సినిమాను ఈ నెల 3వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. ఆ తరువాత ఈ నెల 24వ తేదీకి వాయిదా వేశారు. రీసెంట్ గా మళ్లీ ఈసినిమాను వాయిదా వేసినట్టుగా చెప్పారు. దాంతో ఈ సినిమా ఎప్పుడు ఏ రోజున రానుందనే విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 2వ తేదీన వదిలితే బాగుంటుందేమోననేది మేకర్స్ ఉద్దేశం.

అయితే ముందు రోజునే 'సర్కారువారి పాట' విడుదల ఉంది కనుక, మార్చిలోనే తమ సినిమాను విడుదల చేయడం మంచిదనే ఆలోచన కూడా చేస్తున్నారట. త్వరలోనే అందుకు సంబంధించిన ప్రకటన ఇవ్వనున్నారని అంటున్నారు. జగపతిబాబు ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్న ఈ సినిమాలో, సునీల్ శెట్టి .. ఉపేంద్ర .. నవీన్ చంద్ర ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.