RRR Movie: సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న 'భీమ్లా నాయక్'.. క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు!

  • ఫిబ్రవరి 25కి వెళ్లిన 'భీమ్లా నాయక్'
  • ఏప్రిల్ 29కి 'ఎఫ్ 3' విడుదల
  • జనవరి 7 నే రానున్న 'ఆర్ ఆర్ ఆర్'
  • 'రాధే శ్యామ్' రిలీజ్ డేట్ లోను మార్పులేదు
Bheemla Nayak Release date postponed

సంక్రాంతికి రానున్న సినిమాల విషయంలో కొన్ని రోజులుగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా 'భీమ్లా నాయక్' వస్తుందా .. లేదా? అనే విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. రిలీజ్ డేట్ మార్చుకోవలసిందిగా పవన్ ను 'ఆర్ ఆర్ ఆర్' .. 'రాధేశ్యామ్' నిర్మాతలు కలిసి కోరినట్టుగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దిల్ రాజు .. యూవీ వంశీ .. డీవీవీ దానయ్య ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు.

ఈ ప్రెస్ మీట్ లో దిల్ రాజు మాట్లాడుతూ .. "సంక్రాంతికి 'ఆర్ ఆర్ ఆర్' .. 'రాధేశ్యామ్' .. 'భీమ్లా నాయక్'ను రిలీజ్ చేయాలని నిర్మాతలు అనుకున్నారు. అయితే 'ఆర్ ఆర్ ఆర్' .. 'రాధేశ్యామ్' సినిమాలను మొదలుపెట్టేసి మూడేళ్లు అయింది. పైగా ఆ రెండూ కూడా పాన్ ఇండియా సినిమాలు. తెలుగుతో పాటు అదే రోజున అవి హిందీలో కూడా రిలీజ్ అవుతున్నాయి.

ఈ రెండు సినిమాలకి కూడా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద మొత్తంలో స్క్రీన్లు కావలసి ఉంటుంది. ఉన్న థియేటర్లను మూడు సినిమాలకు కేటాయించే పరిస్థితి లేదు. ఈ విషయంపై పవన్ తోను .. 'భీమ్లా నాయక్' నిర్మాతతోను మాట్లాడటం జరిగింది. అందుకు వారు సానుకూలంగా స్పందించారు. 'భీమ్లా నాయక్' ను ఫిబ్రవరి 25వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. నిజానికి ఆ రోజున మా 'ఎఫ్ 3' రావలసి ఉంది. 'ఎఫ్ 3' ను ఏప్రిల్ 29కి మార్చడం జరిగింది" అంటూ క్లారిటీ ఇవ్వడం జరిగింది. 

More Telugu News