Narendra Modi: జగన్ కు శుభాకాంక్షలు తెలిపిన మోదీ

Modi greets Jagan on his birthday
  • ఈరోజు ఏపీ సీఎం జగన్ పుట్టినరోజు
  • జగన్ కు సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నానన్న మోదీ
  • రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలను చేపట్టిన వైసీపీ శ్రేణులు
ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా జగన్ కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. 'ఏపీ సీఎం జగన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయనకు భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని, సంపూర్ణ జీవితాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా' అంటూ ట్వీట్ చేశారు. 1972 డిసెంబర్ 21న జమ్మలమడుగులో జగన్ జన్మించారు. మరోవైపు జగన్ జన్మదినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నాయి. రక్తదానం, అన్నదానం, మొక్కలు నాటడం, దుప్పట్లు, పండ్లు పంచడం వంటి కార్యక్రమాలను కార్యకర్తలు చేపట్టారు.
Narendra Modi
BJP
Jagan
YSRCP
Birthday

More Telugu News