Shree Cement: ఏపీలో భారీ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చిన శ్రీ సిమెంట్

  • సీఎం జగన్ ను కలిసిన శ్రీ సిమెంట్ యాజమాన్యం
  • తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం
  • గుంటూరు జిల్లాలో పరిశ్రమ ఏర్పాటుకు ప్రతిపాదన
  • రూ.1,500 కోట్ల వ్యయంతో పరిశ్రమ
Shree Cement MD and JMD met CM Jagan to set up huge cement plant in state

ఏపీలో మరో భారీ పరిశ్రమ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీ సిమెంట్ యాజమాన్యం రాష్ట్రంలో పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతోంది. శ్రీ సిమెంట్ ఎండీ హెచ్ఎం బంగూర్, జేఎండీ ప్రశాంత్ బంగూర్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో సమావేశమయ్యారు. ఏపీలో శ్రీ సిమెంట్ పరిశ్రమ స్థాపనపై సాధ్యాసాధ్యాలపై సీఎంతో చర్చించారు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడు వద్ద గ్రీన్ ఫీల్డ్ సిమెంట్ కర్మాగారం నెలకొల్పేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. దీని అంచనా వ్యయం రూ.1,500 కోట్లు.

కాగా, ఏపీలో అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాన్ని సీఎం జగన్ శ్రీ సిమెంట్ అధినేతలకు వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని, కొత్త వ్యాపారవేత్తలకు ఇబ్బందిలేని విధంగా ప్రోత్సాహకాలు అందిస్తున్నామని తెలిపారు.

More Telugu News