Samantha: 'పుష్ప'లో అల్లు అర్జున్ ను చూడగానే నాకు అలాగే అనిపించింది: సమంత

Samantha opines on Allu Arjun performance in Pushpa
  • ఇటీవల విడుదలైన 'పుష్ప'
  • అల్లు అర్జున్ నటనకు సర్వత్రా ప్రశంసలు
  • పుష్పలో ఐటమ్ సాంగ్ చేసిన సమంత
  • బన్నీ నటనకు ఫిదా
ఇటీవల విడుదలైన 'పుష్ప' చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ కు విమర్శకులు సైతం ఫిదా అయ్యారు. ఇందులో 'ఊ అంటావా మామా ఊఊ అంటావా' అనే ఐటమ్ సాంగ్ లో సమంత హొయలు ఒలకబోయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో 'పుష్ప' చిత్రంపై సమంత తన అభిప్రాయాలను వెల్లడించింది.

"ఈ చిత్రంలో అల్లు అర్జున్ నటన ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. ప్రతిక్షణం ఆస్వాదిస్తారు. అసాధ్యం అనుకున్న దాన్ని సాధ్యం చేసే నటులను ఎప్పుడూ స్ఫూర్తిగా తీసుకుంటాను. ఇప్పుడు 'పుష్ప' చూశాక అల్లు అర్జున్ అలాగే కనిపిస్తున్నాడు. ఓ యాసలో మాట్లాడడం నుంచి భుజాన్ని కొంచెం పైకిలేపి నటించడం ప్రతి అంశంలోనూ అదరగొట్టేశాడు. నిజంగా తిరుగులేని నటన... అసలుసిసలైన ప్రేరణ" అంటూ సమంత కొనియాడింది. ఈ మేరకు ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది.

సమంత పోస్టుపై అల్లు అర్జున్ కూడా స్పందించాడు. "హృదయపూర్వక అభినందనలు తెలపడం ద్వారా హృదయాన్ని తాకావు... థాంక్యూ డియర్" అంటూ బదులిచ్చాడు.
Samantha
Allu Arjun
Pushpa
Tollywood

More Telugu News