Nani: దూసుకుపోతున్న సాయిపల్లవి సాంగ్!

  • 'శ్యామ్ సింగ రాయ్'గా నాని
  • సంగీత దర్శకుడిగా మిక్కీ జె మేయర్
  • సిరివెన్నెల సాహిత్యం
  • ఈ నెల 24వ తేదీన సినిమా విడుదల  
Shyam Singha Roy movie update

నాని - సాయిపల్లవి జంటగా 'శ్యామ్ సింగ రాయ్' రూపొందింది. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఈ నెల 24వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా నుంచి వదిలిన లిరికల్ సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.

రీసెంట్ గా ఈ సినిమా నుంచి సాయిపల్లవిపై చిత్రీకరించిన సాంగ్ ను రిలీజ్ చేశారు. "ప్రణవాలయ పాహి .. పరిపాలయ పరమేశి .. " అంటూ ఈ పాట సాగుతోంది. యూ ట్యూబ్ లో వదలగానే ఈ సాంగ్ ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. ఇంతవరకూ ఈ పాట 4 మిలియన్ కి పైగా వ్యూస్ ను సంపాదించుకోవడం విశేషం.

సాయిపల్లవి ఏ సినిమా చేసినా అందులో ఏదో ఒక పాట బాగా పాప్యులర్ అవుతోంది. డాన్స్ పరంగా ఆమెకి మంచి పేరు తీసుకుని వస్తోంది. అలాంటి పాటల జాబితాలో ఈ పాట కూడా చేరిపోవడం విశేషం. సిరివెన్నెల సాహిత్యం .. అనురాగ్ కులకర్ణి ఆలాపన ఈ పాటకి మరింత ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచాయి.

More Telugu News