Pawan Kalyan: 'హరిహర వీర మల్లు' స్క్రిప్టుతో పవన్ బిజీ... ఫొటో ఇదిగో!

  • పవన్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో పీరియాడిక్ చిత్రం
  • 'హరిహర వీర మల్లు'గా టైటిల్
  • అభిమానులను ఉర్రూతలూగిస్తున్న పవన్ స్టిల్స్
  • పవన్ స్క్రిప్టు చదువుతున్న ఫొటో పంచుకున్న క్రిష్
Pawan appears reading Harihara Veera Mallu script with director Krish

పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'హరిహర వీర మల్లు'. ఈ పీరియాడిక్ మూవీలో పవన్ కల్యాణ్ కొత్తగా కనిపిస్తుండడంతో అభిమానుల్లో ఆసక్తి అంతకంతకు అధికమవుతోంది. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన అప్ డేట్ ను దర్శకుడు క్రిష్ అందించారు.

పవన్ కల్యాణ్ తో స్క్రిప్టుపై చర్చల్లో పాల్గొన్నట్టు ఆయన వెల్లడించారు. ఈ రోజు అద్భుతంగా గడిచిందని, పవన్ కల్యాణ్ స్క్రిప్టును చదివారని వివరించారు. కొత్త సంవత్సరంలో ఉద్విగ్నతకు గురిచేసేలా కొత్త షెడ్యూల్ తో పయనం ప్రారంభిస్తామని క్రిష్ పేర్కొన్నారు.

కాగా, పవన్ కల్యాణ్ క్రిస్మస్ సీజన్ సందర్భంగా రష్యా వెళుతున్నట్టు తెలుస్తోంది. పవన్ అర్ధాంగి అన్నా లెజ్నెవా రష్యన్ అన్న సంగతి తెలిసిందే. అన్నా కుటుంబ సభ్యులు క్రైస్తవులు కావడంతో ప్రతిఏటా పవన్ అత్తగారింటికి క్రిస్మస్ వేడుకల కోసం రష్యా వెళుతున్నారు.

తాజా పర్యటనలో భాగంగా ఆయన రష్యాలోనే రెండు వారాల పాటు ఉంటారని సమాచారం. పవన్ తిరిగొచ్చాక కొత్త సంవత్సరం ప్రారంభంలో 'హరిహర వీర మల్లు' షెడ్యూల్ షురూ అవుతుందని క్రిష్ ట్వీట్ ద్వారా అర్థమవుతోంది.

  • Loading...

More Telugu News