Election Acts Amendment Bill: విపక్షాల ఆందోళనల మధ్య ఎన్నికల చట్టాల సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం

  • ఇటీవల బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం
  • నేడు సభలో ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి కిరణ్ రిజిజు
  • కాంగ్రెస్ సహా విపక్షాల వ్యతిరేకత
  • విపక్షాల నిరసనల మధ్యే బిల్లుకు ఆమోదం
  • వాయిదాపడిన లోక్ సభ
Lok Sabha gives approval for election acts amendment bill

పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భాగంగా కేంద్రం ప్రవేశపెట్టిన ఎన్నికల చట్టాల సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. ఓటరు గుర్తింపు కార్డును ఆధార్ తో అనుసంధానం చేసేలా కేంద్రం ఈ బిల్లు తీసుకువచ్చింది. లోక్ సభలో విపక్షాల ఆందోళనల మధ్య బిల్లుకు ఆమోద ముద్ర పడింది. బిల్లు ఆమోదించిన అనంతరం లోక్ సభ వాయిదా పడింది.

నేటి సమావేశాల్లో భాగంగా ఈ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు సభలో ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లు పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉందంటూ కాంగ్రెస్ పార్టీ సహా విపక్షాలు ముక్తకంఠంతో ఆరోపించాయి. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా కేంద్రం వైఖరి ఉందని మండిపడ్డాయి.

More Telugu News