Arslan Goni: ప్రియుడికి గ్రీటింగ్స్ చెప్పిన హృతిక్ రోషన్ మాజీ భార్య

Sussanne Khan birthday greetings to boyfriend Arslan Goni
  • అర్స్లాన్ గోనీ ప్రేమలో ఉన్న సుసానే
  • నిన్న ప్రియుడి పుట్టినరోజు సందర్భంగా గ్రీటింగ్స్ చెప్పిన సుసానే
  • నీవొక అందమైన శక్తివి అంటూ వ్యాఖ్య
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే ఖాన్ ప్రేమలో మునిగి తేలుతోందంటూ బాలీవుడ్ కోడై కూస్తోంది. నటుడు అర్స్లాన్ గోనీతో ఆమె ప్రేమలో ఉందంటూ చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా నిన్న తన ప్రియుడి బర్త్ డే సందర్భంగా ఆమె ఇన్స్టాలో పోస్ట్ చేసింది. అతన్ని హత్తుకున్న ఫొటోను షేర్ చేసింది.

'హ్యాపీ బర్త్ డే. నీ జీవితంలో నీవు కోరుకునేవన్నీ ఉండాలని, స్వచ్ఛమైన ప్రేమ నీ చుట్టూ ఉండాలని కోరుకుంటున్నా. నా జీవితంలో తారసపడిన ఒక అందమైన శక్తివి నీవు' అంటూ వ్యాఖ్యానించింది. దీనికి గోనీ స్పందిస్తూ.. 'లవ్ యూ' అని రిప్లై ఇచ్చాడు.

అక్టోబర్ లో సుసానే పుట్టినరోజు సందర్భంగా గోనీ ఇదే విధంగా స్పందించాడు. 'హ్యాపీ బర్త్ డే డాలింగ్. నీ జీవితం అద్భుతంగా ఉండాలని ప్రార్థిస్తున్నా. నా జీవితంలో నేను చూసిన గొప్ప హృదయం ఉన్న వ్యక్తివి నీవు. నీవు కోరుకున్నదంతా భగవంతుడు ఇవ్వాలని ప్రార్థిస్తున్నా. లాట్స్ ఆఫ్ లవ్' అంటూ గ్రీటింగ్స్ చెప్పాడు.
Arslan Goni
Sussanne Khan
Hrithik Roshan
Bollywood

More Telugu News