Pakistan: గుజరాత్‌లో మరోమారు డ్రగ్స్ కలకలం.. రూ. 400 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత

Pakistan Boat Carrying 77 Kgs Of Heroin Seized In Indian Waters
  • భారత జలాల్లోకి ప్రవేశించిన పాకిస్థాన్ పడవ
  • ఐసీజీ, గుజరాత్ ఏటీఎస్ దాడి
  • 77 కేజీల హెరాయిన్ పట్టివేత
  • ఆరుగురి అరెస్ట్
గుజరాత్‌లో మరోమారు డ్రగ్స్ కలకలం రేగింది. ఈసారి ఏకంగా రూ. 400 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. గుజరాత్ తీరంలో భారత జలాల్లోకి ప్రవేశించిన పాకిస్థాన్ పడవపై దాడి చేసిన భారత తీర రక్షణ దళం (ఐసీజీ), గుజరాత్ ఏటీఎస్  77 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నాయి.

వీటి విలువ రూ. 400 కోట్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. డ్రగ్స్‌ను తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న అధికారులు.. వాటిని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఎక్కడికి తరలిస్తున్నారు? వంటి విషయాలను ఆరా తీస్తున్నారు.
Pakistan
Gujarat
Heroin
ATS
India Coast Guard

More Telugu News