Rai: ఫిలిప్పీన్స్ ను కకావికలం చేసిన సూపర్ టైఫూన్ 'రాయ్'... 112 మంది మృతి

Super Typhoon Rai hammers Philippines
  • పసిఫిక్ మహాసముద్రంలో రాకాసి టైఫూన్
  • ప్రాణ నష్టం వివరాలు వెల్లడించిన ఫిలిప్పీన్స్ సర్కారు
  • కూలిన ఇళ్లు, భవనాలు
  • నిలిచిన విద్యుత్, కమ్యూనికేషన్ సేవలు
  • సహాయక చర్యలు ముమ్మరం
పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన సూపర్ టైఫూన్ రాయ్ ఫిలిప్పీన్స్ ఛిన్నాభిన్నం చేసింది. ఈ ఏడాది ఫిలిప్సీన్స్ ను తాకిన అత్యంత శక్తిమంతమైన టైఫూన్ ఇదే. దీని ధాటికి 112 మంది మరణించారు. 3 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 8 లక్షల మంది ప్రజలు దీని ప్రభావానికి గురయ్యారని ప్రభుత్వం నేడు వివరాలు వెల్లడించింది.

ఫిలిప్పీన్స్ లో ఎక్కడ చూసినా రాయ్ విధ్వంసం తాలూకు ఆనవాళ్లే కనిపిస్తున్నాయి. బీచ్ ల వద్ద ఉండే రిసార్టులు నామరూపాల్లేకుండా తుడిచిపెట్టుకుపోయాయి. విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇళ్లు, కార్యాలయాలు, ఆసుపత్రులు పైకప్పుల్లేని స్థితిలో దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం టైఫూన్ రాయ్ ఫిలిప్పీన్స్ దాటి వెళ్లిపోవడంతో దేశంలో సహాయచర్యలు ముమ్మరం చేశారు. కాగా రాయ్ ఇప్పటికీ టైఫూన్ స్థాయిలోనే కొనసాగుతోంది. ఇది వియత్నాం తీరాన్ని తాకుతూ ఉత్తర దిశగా పయనించనుంది.
Rai
Super Typhoon
Philippines
Pacific Ocean

More Telugu News