Nodal Agency: సినిమా టికెట్ల విక్రయంలో నోడల్ ఏజెన్సీగా ఏపీ స్టేట్ ఫిల్మ్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్

AP govt appoints nodal agency for online cinema ticketing
  • ఏపీలో ఆన్ లైన్ లో సినిమా టికెట్ల విక్రయాలు
  • నోడల్ ఏజెన్సీని నియమించిన ప్రభుత్వం
  • ఉత్తర్వులు జారీ
  • తగిన విధివిధానాలు రూపొందించనున్న నోడల్ ఏజెన్సీ
ఆన్ లైన్ లో సినిమా టికెట్ల అమ్మకాలపై ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. సినిమా టికెట్ల ఆన్ లైన్ బుకింగ్ అంశంలో నోడల్ ఏజెన్సీగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎఫ్ టీవీటీడీసీ) వ్యవహరిస్తుందంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో సినిమా టికెట్లను ఆన్ లైన్ లో విక్రయిస్తున్న అన్ని ప్రైవేటు సంస్థలను ఒకే వేదికపైకి తీసుకురావడం ఈ నోడల్ ఏజెన్సీ బాధ్యత. సినిమాటోగ్రఫీ చట్టానికి చేసిన సవరణలను అనుసరించి సినిమా టికెట్ల అమ్మకాలకు తగిన నమూనాలను, విధివిధానాలను రూపొందించాల్సి ఉంటుంది.

ఏపీ సర్కారు రాష్ట్రంలో సినిమా టికెట్ల ఆన్ లైన్ విక్రయాల కోసం ప్రత్యేక పోర్టల్ రూపకల్పనకు ఓ కమిటీని ఏర్పాటు చేయడం తెలిసిందే. భారతీయ రైల్వే ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థ తరహాలోనే ఏపీలోనూ సినిమా టికెట్ల విక్రయాలు సాగించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
Nodal Agency
APSFTVTDC
Cinema Tickets
Online
Andhra Pradesh

More Telugu News