Bandi Sanjay: మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి: బండి సంజయ్

Bandi Sanjay demands to help road accident death families
  • కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
  • దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన బండి సంజయ్
  • రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆవేదన
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం జగన్నాథపల్లి గేట్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటనపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్సను అందించాలని అన్నారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై పలువురు నేతలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
Bandi Sanjay
BJP
Kamareddy District
Road Accident

More Telugu News