KL Rahul: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ కు టీమిండియా వైస్ కెప్టెన్ గా కేఎల్ రాహుల్

KL Rahul replaces Rohit as Team India Vice Captain
  • దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న టీమిండియా
  • ఈ నెల 26 నుంచి టెస్టు సిరీస్
  • గాయంతో రోహిత్ శర్మ దూరం
  • రోహిత్ స్థానంలో కొత్త వైస్ కెప్టెన్ గా రాహుల్

గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ నుంచి రోహిత్ శర్మ తప్పుకోవడం తెలిసిందే. రోహిత్ శర్మ గైర్హాజరీ నేపథ్యంలో టీమిండియా కొత్త వైస్ కెప్టెన్ గా కేఎల్ రాహుల్ ను నియమిస్తున్నట్టు బీసీసీఐ వెల్లడించింది. మూడు మ్యాచ్ ల టెస్టు సిరీస్ కోసం కోహ్లీకి డిప్యూటీగా ఆలిండియా సీనియర్ సెలెక్షన్ కమిటీ కేఎల్ రాహుల్ ను ఎంపిక చేసినట్టు బోర్డు తెలిపింది. విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా నిన్న దక్షిణాఫ్రికా గడ్డపై అడుగుపెట్టింది. టీమిండియా-దక్షిణాఫ్రికా తొలి టెస్టు ఈ నెల 26 నుంచి సెంచూరియన్ వేదికగా జరగనుంది.

  • Loading...

More Telugu News