Raja Singh: దేవిశ్రీ ప్రసాద్ కు వార్నింగ్ ఇచ్చిన రాజాసింగ్

Raja Singh gives warning to Devisri Prasad
  • 'పుష్ప' సినిమా ప్రమోషన్ లో దేవిశ్రీ వివాదాస్పద వ్యాఖ్యలు
  • తనకు భక్తి గీతాలు, ఐటెం సాంగ్స్ ఒక్కటేనన్న డీఎస్పీ
  • క్షమాపణ చెప్పాలన్న రాజాసింగ్
సినిమా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. 'పుష్ప' సినిమా ప్రమోషన్ లో భాగంగా దేవిశ్రీ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తన దృష్టిలో భక్తి గీతాలు, ఐటెం సాంగ్స్ ఒక్కటేనని దేవిశ్రీ అన్నాడు. అంతేకాదు 'రింగ రింగా', 'ఊ అంటావా మావా' పాటలను భక్తి పాటలుగా మార్చి పాడాడు.

దీంతో డీఎస్పీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా దేవిశ్రీకి రాజాసింగ్ వార్నింగ్ ఇచ్చారు. ఐటెం సాంగుల్లోని పదాలను దేవుడి శ్లోకాలతో పోల్చడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. తన తప్పును తెలుసుకుని దేవిశ్రీ ప్రసాద్ క్షమాపణలు చెప్పాలని... లేకపోతే తెలంగాణ ప్రజలు చెప్పులతో కొట్టి తరిమికొడతారని అన్నారు.
Raja Singh
BJP
Devisri Prasad

More Telugu News