Prabhas: ప్రభాస్ 'రాధే శ్యామ్' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కు గెస్టులు వీరే!

Prabhas fans are guests for Radhe Shyam movie
  • ఈనెల 23న ప్రీరిలీజ్ ఈవెంట్
  • అభిమానులే ఈ ఈవెంట్ గెస్టులు
  • జనవరి 14న విడుదల కానున్న సినిమా

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన 'రాధే శ్యామ్' మూవీ జనవరి 14న విడుదల కాబోతోంది. కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మించిన ఈ చిత్రానికి కేకే రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఐదు భాషల్లో ఈ చిత్రం విడుదలకానుంది.

ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఈనెల 23న జరగనుంది. ఈ ఈవెంట్ కు అభిమానులే గెస్టులుగా హాజరుకానున్నారు. ఐదు భాషలకు చెందిన ట్రైలర్స్ ను ప్రభాస్ అభిమానుల చేతుల మీదుగా విడుదల చేయనున్నారు. ఈవెంట్ కు వచ్చే అభిమానులు కోవిడ్ నిబంధనలు పాటించాలని చిత్ర యూనిట్ తెలిపింది.

  • Loading...

More Telugu News