Balakrishna: 'ఆదిత్య 369' సీక్వెల్ కి స్క్రిప్ట్ రెడీ!

  • బాలకృష్ణ హీరోగా గతంలో వచ్చిన 'ఆదిత్య 369'
  • ఆయన కెరియర్లోనే ఆ సినిమా స్థానం ప్రత్యేకం
  • సీక్వెల్ స్క్రిప్ట్ పూర్తిచేసిన సింగీతం
  • ఆయనే దర్శకత్వం వహించే అవకాశం
Adithya 369 Sequel

బాలకృష్ణ కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల్లో 'ఆదిత్య 369' స్థానం ప్రత్యేకం. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో 1991లో వచ్చిన ఈ సినిమా, అనూహ్యమైన విజయాన్ని సాధించింది. టైమ్ మెషిన్ అనేది ఒకటి ఉంటుందనే విషయాన్ని సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పింది. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా, ఇప్పటికీ ఒక చిత్రమైన అనుభూతిని కలిగిస్తూ ఉంటుంది.

అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ రానుందనే టాక్ చాలా కాలంగా వినిపిస్తోంది. ఈ సినిమా ద్వారానే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందనే ప్రచారం జరిగింది. ఈ సీక్వెల్ కి స్క్రిప్ట్ పూర్తయిందనేది తాజా సమాచారం. భూత .. భవిష్యత్తు కాలాల్లో ప్రయాణించే ఈ టైమ్ మెషిన్ కథ అద్భుతంగా వచ్చిందని చెప్పుకుంటున్నారు.

ఈ సినిమాకి సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. లేదంటే ఆయన పర్యవేక్షణలో నడుస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన 'ప్రాజెక్టు K' సినిమాకి పర్యవేక్షణ బాధ్యతను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో మోక్షజ్ఞ చేస్తాడా .. లేదా? అనే విషయంలో స్పష్టత రావలసి ఉంది.

More Telugu News