Pawan Kalyan: త్రివిక్రమ్ అర్ధాంగి సౌజన్య నాట్యప్రదర్శనకు హాజరైన పవన్ కల్యాణ్... ఫొటోలు ఇవిగో!

Pawan Kalyan attends Soujanya Srinivas dance ballet in Hyderabad
  • శిల్పకళావేదికలో మీనాక్షి కల్యాణం నృత్యరూపకం
  • సిరివెన్నెలకు నివాళులు అర్పించిన పవన్ కల్యాణ్
  • త్రివిక్రమ్ తో కలిసి నృత్యరూపకం వీక్షణ

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అర్ధాంగి సౌజన్య శ్రీనివాస్ నాట్య ప్రదర్శనకు జనసేనాని పవన్ కల్యాణ్ హాజరయ్యారు. సౌజన్య శ్రీనివాస్, ఆమె బృందం హైదరాబాదులోని శిల్పకళావేదికలో మీనాక్షి కల్యాణం నృత్యరూపకం ప్రదర్శిస్తోంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పవన్ కల్యాణ్... ఇటీవల కన్నుమూసిన ప్రముఖ గీతరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం దర్శకుడు త్రివిక్రమ్ తో కలిసి మీనాక్షి కల్యాణం నృత్యరూపకాన్ని తిలకించారు. ఈ కార్యక్రమానికి సంగీత దర్శకుడు తమన్ కూడా విచ్చేశారు.

  • Loading...

More Telugu News