Adivi Sesh: 'హిట్ 2' నుంచి ఫస్టు గ్లింప్స్ రిలీజ్!

HIT movie update
  • విష్వక్సేన్ హీరోగా వచ్చిన 'హిట్'
  • ఆ సినిమాకి సీక్వెల్ గా 'హిట్ 2'
  • హీరోగా అడివి శేష్ 
  • కథానాయికగా మీనాక్షి చౌదరి  
నాని నిర్మాతగా విష్వక్సేన్ హీరోగా 2020లో 'హిట్ .. ది ఫస్టు కేస్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా సక్సెస్ అయింది. ఆ సినిమాకి సీక్వెల్ గా నాని ఇప్పుడు 'హిట్ 2 ది సెకండ్ కేస్' సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్టు గ్లింప్స్ ను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు.

ఈ రోజున అడివి శేష్ పుట్టినరోజు కావడంతో, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి ఫస్టు గ్లింప్స్ ను వదిలారు. ఈ సినిమాలో అడివి శేష్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. ఆయనకి సంబంధించిన యాక్షన్ .. ఎమోషన్ కి సంబంధించిన సన్నివేశాలతో వదిలిన గ్లింప్స్ ఆకట్టుకుంటోంది.

ఒక కేసుకు సంబంధించిన ఆధారాల కోసం సాగే అన్వేషణ .. ఆ నేపథ్యంలో అతనికి సహకరించే పోలీస్ డాగ్ .. కేసు విషయంలో చిక్కుముడులను ఎలా విప్పుకురావాలనే ఆలోచనలో పడటం .. తన అన్వేషణకి అడ్డుపడినవారికి పోలీస్ కోటింగ్ ఇవ్వడం ఇవన్నీ ఇందులో కనిపిస్తున్నాయి.
Adivi Sesh
Meenakshi Choudary
HIT Movie

More Telugu News