Vijay: కీర్తి సురేశ్ విషయంలో వచ్చేసిన క్లారిటీ!

Vamshi Paidipalli movie update
  • కీర్తి సురేశ్ తాజా చిత్రంగా 'గుడ్ లక్ సఖి'
  • ముగింపు దశలో 'సర్కారువారి పాట'
  • సెట్స్ పైకి వెళ్లిన 'భోళా శంకర్'
  • విజయ్ సినిమాలో కీర్తి సురేశ్ లేదు
తెలుగు .. తమిళ భాషల్లో కీర్తి సురేశ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఆమె తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'గుడ్ లక్ సఖి' సినిమా రెడీ అవుతోంది. ఈ సినిమా ఈ నెల 31వ తేదీన విడుదల కానుంది. ఆ తరువాత ప్రాజెక్టులుగా ఆమె చేతిలో 'సర్కారువారి పాట' .. 'భోళా శంకర్' సినిమాలు ఉన్నాయి.

మహేశ్ బాబు - పరశురామ్ కాంబినేషన్లో రూపొందుతున్న 'సర్కారువారి పాట' చిత్రీకరణ పరంగా చివరిదశకి చేరుకుంది. ఇక చిరంజీవి కథానాయకుడిగా మెహర్ రమేశ్ రూపొందిస్తున్న 'భోళా శంకర్' ఇటీవలే సెట్స్ పైకి వెళ్లింది. ఈ నేపథ్యంలోనే ఆమె వంశీ పైడిపల్లి సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్టుగా వార్తలు వస్తున్నాయి.

విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి ఒక సినిమా చేస్తున్నాడు. కెరియర్ పరంగా విజయ్ కి 66వ సినిమా. ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా కీర్తి సురేశ్ పేరు వినిపించింది. అందులో ఎలాంటి వాస్తవం లేదని మేకర్స్ అధికారికంగా స్పష్టం చేశారు. మరి ఇక, విజయ్ జోడీగా ఎవరికి ఛాన్స్ దొరుకుతుందో చూడాలి.
Vijay
Keerthi Suresh
Dil Raju
Vamsi Paidipalli Movie

More Telugu News