North Korea: 10 రోజులు ఎవరూ నవ్వకూడదంటూ నిషేధం విధించిన ఉత్తరకొరియా

  • మాజీ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఇల్ వర్ధంతి నేపథ్యంలో ఆంక్షలు
  • ఆదేశాలను అతిక్రమిస్తే కఠిన శిక్షలే
  • పలు కార్యక్రమాలను  నిర్వహించేందుకు సిద్ధమవుతున్న నార్త్ కొరియా
North Korea bans laughing for 10 days

దేశ ప్రజలు 10 రోజుల పాటు నవ్వడం, మద్యం సేవించడం, షాపింగ్ చేయడంపై ఉత్తరకొరియా నిషేధం విధించింది. దేశ మాజీ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఇల్ 10వ వర్ధంతి నేపథ్యంలో ఈ నిషేధాన్ని విధించారు. ఈ నిషేధాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని... ఎవరైనా ఆదేశాలను అతిక్రమిస్తే కఠిన శిక్షలను ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు హెచ్చరించారు.

గతంలో ఈ సంతాప దినాల సమయంలో మద్యం సేవించిన వారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారని... వాళ్లు ఇంతవరకు మళ్లీ కనిపించలేదని ఓ వ్యక్తి తెలిపాడు. అంత్యక్రియలను కూడా నిర్వహించడానికి వీలుండదని, పుట్టినరోజులు కూడా ఎవరూ నిర్వహించుకోకూడదని చెప్పాడు. మరోవైపు ఈ సందర్భంగా పలు కార్యక్రమాలను నిర్వహించేందుకు ఉత్తరకొరియా సిద్ధమవుతోంది. కిమ్ జాంగ్ ఇల్ జీవితానికి సంబంధించిన ఫొటోలను ప్రదర్శించడం వంటి కార్యక్రమాలను చేపట్టబోతోంది.

More Telugu News