Tollywood: వికారాబాద్ లో భీమ్లా నాయక్ షూట్.. పవన్ ను చూసేందుకు తండోపతండాలుగా తరలివచ్చిన జనం

Pawan Bheemla Nayak Shoot In Vikarabad
  • మదన్ పల్లి ఎల్లమ్మ ఆలయం వద్ద షూటింగ్
  • పవన్.. పవన్ అంటూ హోరెత్తిన నినాదాలు
  • కారు సన్ రూఫ్ నుంచి అభిమానులకు పవన్ అభివాదం

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న సినిమా ‘భీమ్లా నాయక్’. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రంలో రానా విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమా తాజా షెడ్యూల్ శుక్రవారం ఉదయం మొదలైంది.

ఇందులో భాగంగా, వికారాబాద్ లోని మదన్ పల్లి  ఎల్లమ్మ ఆలయం వద్ద కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. పవన్ కల్యాణ్ షూటింగ్ లో పాల్గొన్నాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. 'పవన్ కల్యాణ్' అంటూ పిలుపులతో హోరెత్తించారు.

దీంతో ఆయన కారు సన్ రూఫ్ నుంచి అభిమానులకు అభివాదం చేశారు. ఆ తర్వాత కారు డోర్ నుంచి అభిమానులను పలకరించారు. దీంతో అక్కడ సందడి నెలకొంది. కాగా సినిమాలో పవన్ కు జోడీగా నిత్యామీనన్, రానాకు జంటగా సంయుక్త మీనన్ నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న సినిమా విడుదల కానుంది.

  • Loading...

More Telugu News