Miss World 2021: మానసతో పాటు మరో 16 మందికి కరోనా... ఫైనల్స్ కు కొన్ని గంటల ముందు మిస్ వరల్డ్ పోటీలు వాయిదా!

Miss World 2021 postponed
  • ప్యూర్టోరికోలో జరగాల్సిన మిస్ వరల్డ్ 2021 ఫైనల్స్
  • ఐసొలేషన్ లో అందాలభామలు
  • మరో 90 రోజుల్లో ఫైనల్స్ నిర్వహిస్తామన్న నిర్వాహకులు
మిస్ వరల్డ్ 2021 పోటీలు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. అందాల పోటీలో పాల్గొంటున్న పలువురు ముద్దుగుమ్మలు కరోనా బారిన పడటమే దీనికి కారణం. ఫైనల్స్ ఈవెంట్ ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు మిస్ వరల్డ్ నిర్వాహకుల నుంచి ఈ ప్రకటన వెలువడింది.

 ప్యూర్టోరికోలో ఫైనల్స్ జరగాల్సి ఉంది. మరోవైపు కంటెస్టెంట్లందరూ ప్యూర్టోరికోలో ఐసొలేషన్ లో ఉన్నారు. కరోనా బారిన పడుతున్న కంటెస్టెంట్ల సంఖ్య పెరుగుతుండటంతో మిస్ వరల్డ్ ఫైనల్స్ ను వాయిదా వేయాలనే నిర్ణయం తీసుకున్నట్టు అధికారక ప్రకటన ద్వారా నిర్వాహకులు వెల్లడించారు. 90 రోజుల వ్యవధిలో ప్యూర్టోరికోలో ఫైనల్స్ నిర్వహిస్తామని తెలిపారు.

మొత్తం 17 మంది కంటెస్టెంట్లు, స్టాఫ్ మెంబర్లు కరోనా బారిన పడ్డారు. వారికి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. కరోనా బారిన పడిన వారిలో మిస్ ఇండియా 2020 మానస వారణాసి కూడా ఉన్నారు. మిస్ వరల్డ్ పోటీల్లో ఇండియా తరపున మానస పోటీపడుతున్నారు.
Miss World 2021
Puerto Rico
Postpone
Corona Virus
Mansasa Varanasi

More Telugu News