Nagarjuna: బుల్లి 'బంగార్రాజు' దుమ్మురేపేసేలా ఉన్నాడే!

Bangarraju Movie Update
  • 'బంగార్రాజు'గా నాగార్జున
  • కథలో వారసుడిగా నాగచైతన్య
  • ఈ సాయంత్రం సాంగ్ టీజర్
  • సంక్రాంతికి రిలీజ్ చేసే ఛాన్స్
నాగార్జున - నాగచైతన్య కాంబినేషన్లో 'బంగార్రాజు' సినిమా రూపొందుతోంది. నాగార్జున సొంత బ్యానర్లో నిర్మితమవుతున్న ఈ సినిమాకి కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు గ్యాప్ లేకుండా జరుగుతోంది. నాగార్జున సరసన నాయికగా రమ్యకృష్ణ నటిస్తుండగా, చైతూ జోడీగా కృతి శెట్టి అలరించనుంది.

గ్రామీణ నేపథ్యంలో పల్లెటూరి బుల్లోడుగా నాగార్జున కనిపించనుండగా, ఆయన వారసుడైన బుల్లి బంగార్రాజుగా చైతూ అలరించనున్నాడు. ఇద్దరూ రొమాంటిక్ హీరోలుగానే సందడి చేయనున్నారు. ఈ సినిమాలో రెండు ఐటమ్ సాంగ్స్ ఉన్నట్టుగా చెబుతున్నారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఫరియా అబ్దుల్లా - చైతూ పై ఒక ఐటమ్ సాంగ్ ను చిత్రీకరించారు.

ఆ ఐటమ్ సాంగ్ కి సంబంధించిన లిరికల్ టీజర్ ను ఈ రోజు సాయంత్రం 5:12 నిమిషాలకు విడుదల చేయనున్నారు. ఇక మరో ఐటమ్ సాంగ్ లో దీక్ష నగర్కార్ మెరవనుందని, అనూప్ రూబెన్స్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
Nagarjuna
Nagachaitanya
Fariya
Krithi Shetty
Bangarraju Movie

More Telugu News