Allu Arjun: 'పుష్ప' సెకండ్ పార్ట్ టైటిల్ ఇదే!

  • ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 'పుష్ప'
  • బన్నీ నటనకు ఫిదా అయిపోతున్న అభిమానులు
  • రెండో పార్ట్ కు 'పుష్ప - ది రూల్' అని పేరు పెట్టిన సుకుమార్
The title of Pushpa movie second part

అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన అల్లు అర్జున్ 'పుష్ప' సినిమా ఈరోజు విడుదలైంది. తొలి షోతోనే ఈ సినిమా హిట్ టాక్ ను తెచ్చుకుంది. అల్లు అర్జున్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు.

ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ రెండు భాగాలుగా తీస్తున్న సంగతి తెలిసిందే. తొలి పార్ట్ కు 'పుష్ప - ది రైజ్' అనే టైటిల్ పెట్టారు. రెండో పార్ట్ కు ఏం టైటిల్ పెడతారోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూశారు. పార్ట్ వన్ ఎండింగ్ లో రెండో పార్ట్ పేరు ఏమిటో సుకుమార్ వెల్లడించారు. రెండో భాగానికి 'పుష్ప - ది రూల్' అనే పేరు పెట్టారు.

తొలి పార్ట్ లోనే మాస్ ఎలిమెంట్స్ ని ఓ రేంజ్ కు తీసుకెళ్లిన సుకుమార్... రెండో పార్ట్ లో దీన్ని మరింత పీక్స్ కు తీసుకెళ్లబోతున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా కొనసాగుతుంది. తూర్పుగోదావరి జిల్లాలోని మారేడుమిల్లి అడవుల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

More Telugu News