Gorantla Butchaiah Chowdary: ఇక బ్యాంకుల్లో డిపాజిట్ దారులకు గ్యారెంటీ ఎక్కడ ఉంటుంది?: గోరంట్ల బుచ్చయ్య చౌద‌రి

  • బ్యాంకులు ప్రైవేటుపరం చేయడం హేయమైన చర్య
  • ప్ర‌భుత్వం పెద్దన్న పాత్ర పోషించాలి
  • కానీ ప్రభుత్వమే పైవేటు పరం చేయాలనుకోకూడదు 
  • మధ్య తరగతి వాళ్లు కూడబెట్టిన సొమ్ముకి భరోసా ఎవరిస్తారన్న బుచ్చయ్య 
gorantla fires on govt

ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్ర ప్ర‌భుత్వ తీరును నిర‌సిస్తూ బ్యాంకుల ఉద్యోగులు రెండు రోజుల‌ ఆందోళ‌నకు దిగిన విష‌యం తెలిసిందే. బ్యాంకు యూనియ‌న్లు చేస్తోన్న ఆందోళ‌న‌కు హాజ‌రైన టీడీపీ నేత గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి కేంద్ర ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు.

'బ్యాంకుల‌ను ప్రైవేటు పరం చేయడం హేయమైన చర్య. ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించాలి కానీ ప్రభుత్వమే ప్రైవేటు పరం చేయాలి అని అనుకోవడం సబబు కాదు. ఇలా ప్రైవేటుపరం చేస్తే డిపాజిట్ల దారులకు గ్యారెంటీ ఎక్కడ ఉంటుంది న‌రేంద్ర మోదీ?' అంటూ గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి విమ‌ర్శించారు.
 
'చిరు ఉద్యోగులు, పేద మధ్య తరగతి వాళ్లు కొంచం మొత్తంలో కూడబెట్టిన సొమ్ముకి భరోసా ఎవరు ఇస్తారు నిర్మలా సీతారామ‌న్? ఉద్యోగులకి భరోసా ఎక్కడ ఉంటుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను' అని గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి అన్నారు.

More Telugu News