Radhe Shyam: ప్రభాస్ 'రాధే శ్యామ్' నుంచి 'సంచారి' పాట విడుదల.. వీడియో ఇదిగో!

  • ప్రభాస్, పూజా హెగ్డే కాంబినేషన్ లో 'రాధే శ్యామ్'
  • ఇప్పటి వరకు విడుదలైన మూడు పాటలు
  • 1950ల నాటి ప్రేమ కథతో తెరకెక్కుతున్న చిత్రం
Sanchari Video Song from Rahde Shyam Prabhas

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అందాలభామ పూజా హెగ్డే జంటగా వస్తోన్న 'రాధే శ్యామ్' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషన్ వీడియోలు, పాటలకు సినీ అభిమానుల నుంచి విశేషమైన ఆదరణ లభించింది. ఈరోజు మూడో పాట 'సంచారి'ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాటలో ప్రభాస్ స్టయిలిష్ లుక్ లో ఉన్నారు. పాట మొత్తాన్ని విదేశాల్లోనే చిత్రీకరించారు. ఈ పాటను కృష్ణకాంత్ రాశారు.

1950ల నాటి ప్రేమ కథాంశం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రానికి 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోని 'ఈ రాతలే', 'నగుమోము తారలే' అనే రెండు పాటలను సినిమా యూనిట్ విడుదల చేసింది. 'సంచారి' పాటను మీరు కూడా వీక్షించండి.

More Telugu News