Music Produer: డొమినికన్ రిపబ్లిక్‌లో కూలిన ప్రైవేటు విమానం.. మ్యూజిక్ ప్రొడ్యూసర్ ఫ్లో లా మూవీ కుటుంబం దుర్మరణం

Music producer Flow La Movie family killed in plane crash
  • విమానం టేకాఫ్ అయిన 15 నిమిషాలకే సాంకేతిక సమస్య
  • ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు  యత్నిస్తున్న సమయంలో కూలిన విమానం
  • ఫ్లో లా మూవీ కుటుంబం సహా 9 మంది దుర్మరణం
డొమినికన్ రిపబ్లిక్‌లో నిన్న జరిగిన విమాన ప్రమాదంలో అందులో ఉన్న 9 మందీ ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ప్యూర్టోరికోకు చెందిన మ్యూజిక్ ప్రొడ్యూసర్ ఫ్లో లా మూవీ (38), ఆయన భార్య (31), వారి నాలుగేళ్ల కుమారుడు కూడా ఉన్నారు. మరణించిన వారిలో ఏడుగురు ప్రయాణికులు కాగా, ఇద్దరు విమాన సిబ్బంది. డొమినికన్ రిపబ్లిక్ రాజధాని శాంటా డొమింగోలో విమానం అత్యవసర ల్యాండింగ్‌కు యత్నిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

ప్రమాదంలో మరణించిన ఏడుగురిలో ఆరుగురు విదేశీయులు, ఒక డొమినికన్ ఉన్నట్టు విమానయాన సంస్థ హెలిడోసా ఏవియేషన్ గ్రూప్ తెలిపింది. డొమినికన్ రిపబ్లిక్‌ నుంచి అమెరికాలోని ఫ్లోరిడా వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. లాస్ అమెరికాస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో టేకాఫ్ అయిన 15 నిమిషాలకే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తున్న సమయంలో కుప్పకూలింది.
Music Produer
Flow La Movie
Plane Crash
Dominican Republic

More Telugu News