West Bengal: పశ్చిమ బెంగాల్‌లో ఏడేళ్ల బాలుడికి ఒమిక్రాన్.. 65కు పెరిగిన కేసులు

  • ముర్షీదాబాద్ చిన్నారికి సోకిన ఒమిక్రాన్
  • ఈ నెల 10న అబుదాబి నుంచి రాక
  • దంపతులకు నెగటివ్, బాలుడికి పాజిటివ్
  • ఆరోగ్యం నిలకడగానే ఉందన్న అధికారులు
  • పశ్చిమ బెంగాల్‌లో తొలి కేసు
7 year old Murshidabad boy tests Omicron Positive

అత్యంత ప్రమాదకారిగా భావిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ మన దేశంలోనూ క్రమంగా వ్యాప్తి చెందుతోంది. నిన్న పశ్చిమ బెంగాల్‌లో తొలి కేసు నమోదైంది. రాష్ట్రంలోని ముర్షీదాబాద్‌కు చెందిన ఏడేళ్ల బాలుడిలో ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించినట్టు వైద్యాధికారులు తెలిపారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు చెప్పారు. ముర్షీదాబాద్‌కు చెందిన దంపతులు, తమ ఏడేళ్ల కుమారుడితో కలిసి ఈ నెల 10న అబుదాబి నుంచి హైదరాబాద్ చేరుకున్నారు.

అక్కడి నుంచి పశ్చిమ బెంగాల్ వెళ్లిపోయారు. హైదరాబాద్‌లో వారికి నిర్వహించిన పరీక్షల్లో దంపతులిద్దరికీ కరోనా సోకలేదని నిర్ధారణ కాగా, బాలుడికి పాజిటివ్‌గా తేలింది. దీంతో చిన్నారి నమూనాలను జినోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపారు. నిన్న నివేదిక రాగా ఒమిక్రాన్ సోకినట్టు నిర్ధారణ అయింది. బాలుడికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టు వైద్యాధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News