MLA Velagapudi: వైసీపీ ప్రభుత్వం ట్రాన్సిట్ హాల్ట్ ను డంపింగ్ యార్డ్ గా మార్చింది: ఎమ్మెల్యే వెలగపూడి

YSRCP Govt made transit halt as dumping yard says Telugudesam MLA Velagapudi
  • టీడీపీ హయాంలో ముడసర్లోవ వద్ద రూ. 8.20 కోట్లతో ట్రాన్సిట్ హాల్ ఏర్పాటు చేశాం
  • దీన్ని వైసీపీ ప్రభుత్వం డంపింగ్ యార్డుగా మార్చింది
  • దీని వల్ల స్థానికుల ఆరోగ్యం దెబ్బతింటోంది
వైసీపీ ప్రభుత్వ తీరుపై టీడీపీ విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ విమర్శలు గుప్పించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ముడసర్లోవ వద్ద రూ. 8.20 కోట్ల వ్యయంతో ట్రాన్సిట్ హాల్ట్ ను ఏర్పాటు చేశామని... ఆధునిక యంత్రాలతో చెత్త నుంచి కాంపోస్టు తయారీ, మిగిలిన చెత్తను కాపులుప్పాడ యార్డుకు తరలించాలనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్లాంట్ కు నిధులు ఇవ్వకుండా... చివరకు చెత్త డంపింగ్ యార్డుగా మార్చేశారని మండిపడ్డారు.

ఈ డంపింగ్ యార్డు వల్ల ముడసర్లోవ రిజర్వాయర్ జలాలు, భూగర్భ జలాలు పూర్తిగా కలుషితం అవుతున్నాయని వెలగపూడి అన్నారు. డంపింగ్ యార్డ్ వల్ల స్థానికుల ఆరోగ్యం దెబ్బతింటోందని చెప్పారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. వైసీపీ నేతలు ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించకుండా... ప్రతిపక్ష నేతల మాదిరి అధికారులకు వినతిపత్రాలను ఇస్తున్నారని విమర్శించారు.
MLA Velagapudi
Vizag
Dumping Yard
Telugudesam
ysr

More Telugu News